కోనసీమ: ఆలమూరు గ్రామ పరిసర ప్రాంతం లో పేకాట ఆడుతున్న పదిమంది వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3050 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆలమూరు ఎస్సై నరేష్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.