MHBD: గార్ల మండలం సత్యనారాయణపురం గ్రామంలోని వరి పొలాలను బుధవారం స్థానిక రైతులతో కలిసి, AO రామారావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వరి పంట పొట్ట దశలో దోమ, ఇతర తెగుళ్ల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. దోమ పోటు నివారణకు లీటరు నీటికి పైమెట్రోజిన్ 0.5 గ్రాములు లేదా మిశ్రమ మందు 0.65 గ్రాములు కలిపి మొక్కల మొదళ్ల పై పిచికారీ చేయాలని సూచించారు.