SDPT: వర్గల్ మండల కేంద్రంలో రూ. 1.56 కోర్టుతో నిర్మించిన నూతన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం రాత్రి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. పేదలకు వైద్యం అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, ఆర్డీవో చంద్రకళ, పంచాయతి రాజ్ ఎస్ఈ నరేందర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.