NLG: నేటి ఉపాధ్యాయ తరానికి దార్శనికుడు దివంగత మాజీ ఎమ్మెల్సీ బీరవెల్లి ధర్మారెడ్డి అని నల్లగొండ – ఖమ్మం- వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని పీఆర్టీయూ భవనం వద్ద ఏర్పాటు చేసిన ధర్మారెడ్డి విగ్రహాన్ని పీఆర్టీయూ రాష్ట్ర, జిల్లా నాయకులు, దర్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.