GDWL: తెలంగాణ సరిహద్దు చెకోపోస్టులను మూసివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. మానవపాడు మండలంలోని చెకోపోస్టును బుధవారం సాయంత్రం 5 గంటలకు తొలగించారు. చెక్ పోస్టు కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, బోర్డులు, బ్యారికేడ్లను తొలగించారు. ఈ సామగ్రిని జిల్లా కేంద్రంలోని కార్యాలయాలనికి తరలించినట్లు ఎంవీఐ రాజు తెలిపారు.