KNR:సైదాపూర్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు తనిఖీ చేశారు. సరైన ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి వైదేహి ఉన్నారు.