PPM: పార్వతీపురం జిల్లాలో వైద్యులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా జ్వరాలు వస్తే అక్కడికక్కడే స్పందించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వైద్యాధికారులను తేల్చిచెప్పారు. వసతి గృహల్లోని పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్ళక ముందే ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు.