WGL: నల్లబెల్లి మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం ఏపీఎం కందిక సుధాకర్ అధ్యక్షతన వరి ధాన్యం కొనుగోలు కమిటీల నిర్వహణ మార్గదర్శకాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిపిఎం దాసు హాజరై మాట్లాడుతూ.. రైతులు తెచ్చే ధాన్యం తేమశాతం 17% లోపు, తాలు లేకుండా చూసుకొని మద్దతు ధర పొందాలన్నారు. మహిళలు సెంటర్ నిర్వహణలో భాగస్వాములు కావాలని సూచించారు.