NLG: వర్షం కారణంగా ధాన్యం తడవకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ మండలం ముసంపల్లి, జికే అన్నారం గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు సరైన తేమ శాతంతో తీసుకొని వస్తే వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.