బంగారం నిల్వల్లో ఆర్బీఐ కొత్త రికార్డును సృష్టించింది. ఆర్బీఐ దగ్గర మొత్తం బంగారం నిల్వలు 880.18 మెట్రిక్ టన్నులకు చేరాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా.. గత ఆరు నెలల్లో 600 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారంపై పెట్టుబడులు భారీగా పెరిగాయి.