NLG: వేములపల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు ఇవాళ తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గ్రామ శివారులోని మూసి వాగు నుంచి ఇసుక ను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని ట్రాక్టర్లను స్టేషన్కు తరలించామన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.