AP: ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆక్వా రంగాన్ని జోన్, నాన్ జోన్లుగా విభజించి అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆక్వా రైతులు రిజిస్టర్ అయిన తర్వాతే యూనిట్‌కు రూ. 1.50 చొప్పున సబ్సిడీ విద్యుత్ ప్రయోజనం వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.