బంగ్లాదేశ్తో జరుగుతోన్న మ్యాచ్లో టాస్ ఓడిన అనంతం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపాడు. గత నాలుగు మ్యాచ్ల్లో తాము ఆశించిన ఫలితాలు వచ్చాయన్నాడు. అందుకే ముందుగా బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. గత మ్యాచ్ల మాదిరిగా రాణించాల్సిన అవసరం ఉందని అన్నాడు.