బీహార్లోని పాట్నాలో కాంగ్రెస్ CWC సమావేశం నిర్వహించడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. 85 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు పాట్నా గుర్తొచ్చిందా? అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. తేజస్వి యాదవ్కు ఎక్కువ సీట్లు ఇవ్వడం ఇష్టం లేక, కాంగ్రెస్ డ్రైవింగ్ సీటులోకి రావాలని చూస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే సమావేశం నిర్వహించారని అన్నారు.