W.G: మహనీయుల త్యాగాలు, మహాత్మాగాంధీ ఆశయాలు భావితరాలకు చెప్పడం కోసం వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహించడం ఒక స్ఫూర్తి అని ఎస్టీవో అధికారి అల్లూరి రవివర్మ అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్థూపం వద్ద గురువారం మహాత్మాగాంధీ జయంతోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. శాంతి అహింస ఆయుధాలుగా స్వాతంత్రం సాధించిన మహాత్మాగాంధీ ఆశయాలు నేటి యువత నెరవేర్చాలన్నారు.