MDK: మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బస్ స్టాండ్, హోటళ్లు, పాన్ షాపులు వంటి ప్రదేశాల్లో గురువారం పోలీసులు నార్కోటిక్స్ బృందాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాల కోసం తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.