మాలేగావ్ పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన ప్రసాద్ పురోహిత్‌ను NIA కోర్టు నిర్దోషిగా తేల్చింది. తాజాగా ఆయనకు కల్నల్‌గా ప్రమోషన్ లభించింది. 2008లో జరిగిన ఈ పేలుళ్లలో ఆరుగురు మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో పురోహిత్‌తో పాటు మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది.