KNRL: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు గట్టిగా పని చేస్తూ పెండింగ్ కేసులు తగ్గించాలని SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ సంధర్బంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు. ప్రతి కేసు వివరాలను ఎప్పటికప్పుడు CCTNSలో నమోదు చేయాలన్నారు.