MNCL: నెన్నెల మండలం మైలారం గ్రామపంచాయతీ దుబ్బపల్లికి చెందిన అర్ష మారయ్య, గావిడి మల్లేష్లపై గురువారం 3 ఎలుగుబంట్లు ఆకస్మికంగా దాడి చేశాయి. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. మాజీ MPTC హరీష్ గౌడ్ గాయపడిన వారిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.