AP: గత పాలకుల అరాచకాలకు తానే మొదటి బాధితుడినని CM చంద్రబాబు అన్నారు. గల్లా జయదేవ్ తన పరిశ్రమను పొరుగు రాష్ట్రానికి తరలించి, రాజకీయాల నుంచి తప్పుకునేలా చేశారని గుర్తుచేశారు. వివేకా హత్య జరిగినప్పుడు క్రైమ్ సీన్లో శంకరయ్య ఉన్నారని చెప్పారు. శంకరయ్య ఒక CMకు నోటీసులు పంపించేంత ధైర్యం చేశారని, నేరస్తులతో కలిసి ఈ స్థాయికి చేరుకున్నారని విమర్శించారు.