MDK: వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమంలో భాగంగా రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేస్తున్నట్లు పాపన్న పేట్ మండల వ్యవసాయ అధికారి నాగమాధురి తెలిపారు. ఈ సందర్భంగా బ్యాటరీ స్పేయర్స్, కల్టివేటర్స్, పవర్ టిల్లర్స్, రోటోవేటర్, పవర్ వీడర్, స్ట్రా బ్యాలెర్, సీడ్ కమ్ ఫెర్టీ డ్రిల్ అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరం ఉన్న రైతులు వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.