ASR: పెదబయలు పోలీస్ స్టేషన్ను గురువారం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. మావోయిస్టు వారోత్సవాల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు చేపడుతున్న చర్యలు గురించి ఎస్సై కొల్లి రమణను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.