CTR: పుంగనూరు మండల పరిధిలోని చదళ్ల గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వేదపండితులు ఆలయావరణంలో హోమాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారిని అభిషేకించి కంచి కామాక్షి రూపంలో అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం గ్రామ పరిసరాల నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.