GNTR: ఫిరంగిపురం మండలం రేపూడిలో ఏక్ దిన్.. ఏక్ గంటా.. ఏక్ సౌత్, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఎంపీడీఓ అధ్యక్షతన శ్రమదానం చేశారు. అధికారులు గ్రామాన్ని శుభ్రం చేసి స్వచ్ఛత పట్ల తమ నిబద్ధతను చాటారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీవో రవిబాబు, స్వచ్ఛభారత్ మండల కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.