AP: సచివాలయం సమీపంలో నిర్వహించిన డీఎస్సీ విజేతలకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. సీఎంగా తాను విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నానని, విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి డీఎస్సీపైనే తొలి సంతకం చేశానని తెలిపారు.