VSP: విశాఖ పోర్టులో స్వచ్ఛత పఖ్వాడ కార్యక్రమం నిర్వహించారు. పోర్టు డిప్యూటీ ఛైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే ఆధ్వర్యంలో గురువారం వెంకటేశ్వర స్వామి దేవాలయం, సాలిగ్రామపురంలో ‘ఏక్ దిన్ -ఏక్ గంటా-ఏక్ సాథ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగమైన ఈ శుభ్రతా ఉద్యమంలో విభాగాధిపతులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.