కోనసీమ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన GST తగ్గింపు ప్రయోజనం ప్రజలందరికీ అందాలని కలెక్టర్ మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. జీఎస్టీ అంశం సులభంగా అమలయ్యేలా అన్ని శాఖల అధికారులు దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. అత్యవసర వస్తువులపై జీఎస్టీ గణనీయంగా తగ్గిందని తెలిపారు. దీనిపై ఇవాళ కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.