కోనసీమ: ఇటీవల రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నాయకులు కర్రి పాపారాయుడు బుధవారం తాడేపల్లిలో మాజీ CM YS జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా YCP రాష్ట్ర కార్యదర్శి కర్రీ పాపారాయుడు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. అనంతరం ఉమ్మడి తూ. గో జిల్లాలో పార్టీ పరిస్థితి జగన్కు ఆయన వివరించారు.