SKLM: కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం మేర యువ భారత్ ఆధ్వర్యంలో ‘యువ నాయకులు (క్వీజ్) ప్రసంగ పోటీలు’ జరగనున్నాయి. వీటికి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు అర్హులని మేర యువ భారత్ డిప్యూటీ డైరక్టర్ వెంకట్ ఉజ్వల్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు https://www.MYBharat.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 30లోగా నమోదు చేయాలన్నారు.