లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో మలయాళ నటుడు అమిత్ చక్కలకల్ నివాసంలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిపై అమిత్ స్పందిస్తూ.. అధికారులు స్వాధీనం చేసుకున్న కార్లలో ఒకటి మాత్రమే తనదని చెప్పారు. మిగిలిన కార్లను వాటి ఓనర్స్ మరమ్మతుల కోసం తన వద్దకు తీసుకొచ్చారన్నారు. గతంలో ఇదే విషయంపై సమన్లు జారీ కాగా.. అందుకు సంబంధించిన పత్రలన్నింటినీ అందించానని చెప్పారు.