NLR: స్వదేశీ వస్తువులనే వాడి స్థానిక వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం నగరంలోని పెద్ద బజార్ ప్రాంతం డైకాస్ రోడ్డులో జీఎస్టీ 2.0పై వ్యాపారులకు, స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.