ప్రకాశం: మార్కాపురం మండలం కొట్టాలపల్లిలో ‘స్వస్థ నారీ – సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు తిప్పాయపాలెం PHC డా.రోహిత్ నాయక్ మహిళలకు గర్భకోశ వ్యాధులు, క్యాన్సర్ పరీక్షలు చేసి ఫ్రీగా మందులు అందించారు. ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. అనంతరం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.