హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)తో రక్షణ శాఖ కీలక ఒప్పందం చేసుకుంది. రూ.62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కోనుగోలుకు MOU కుదర్చుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ 97 విమానాల్లో 68 యుద్ధ విమానాలు, 29 ట్విన్ సీటర్స్ ఉండనున్నట్లు తెలిపింది. 2027-28 నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. మిగ్-21 యుద్ధం విమానాలను ఇవి భర్తీ చేయనున్నాయి.