విశాఖ సిటీ కంచరపాలెంలోని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. 900కు పైగా ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.