అన్నమయ్య: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన అభిమాని మదనపల్లెలో ఇవాళ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, మార్కెట్ చైర్మన్ జంగాల శివరాంలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం పదికాలాలపాటు నిలిచిపోతుందన్నారు.