KNR: సైదాపూర్ మండలం గొడిశాలలో వేల్పుల స్వప్నకు 10 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల చంద్రమౌళి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో పేద ప్రజలకు సీఎం రిలీఫ్ బాసటగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షుడు పోగు రమేష్, మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.