PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి సంస్థ OCP ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. నాలుగు OCP ప్రాజెక్టులలో సుమారు 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ప్రాజెక్టు పని ప్రదేశాలలో వరద నీరు నిల్వ ఉండడం వల్ల భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది.