KMM: పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా మార్కెట్ విలువ సవరణ ప్రతిపాదనలు తయారు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్, రెవెన్యూ శాఖలోని పలు అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం సేకరించిన భూములను ఆయా శాఖల పేరు మీద మ్యూటేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు.