ABD: ప్రజలకు, గర్భిణీ మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆదేశించారు. గురువారం ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలను ముందుగానే గుర్తించి ఆసుపత్రిలో చేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఉన్నారు.