MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మకు రాజగోపురంలో శుక్రవారం చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారికి మహాలక్ష్మి (స్కంద మాత) అలంకరణలో దివ్యదర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకుంటున్నారు.