NLG: తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని మాజీ సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి మండలంలోని రావులపెంట గ్రామంలో ఐదవ రోజు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మ పేర్చి రామ రామ ఉయ్యాలో… బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాల అనే పాటలతో మహిళలు సందడి చేశారు.