NZB: ఎన్నికల హామీల కంటే అధికంగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు గురువారం సాయంత్రం ఆయన రూ. 28 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో అప్పులపాలైన వారికి ఈ చెక్కులు ఆర్థిక ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు.