KRNL: జిల్లాకు చెందిన బాలిక సుగాలి ప్రీతి కేసు విచారణ బాధ్యతల్ని కూటమి ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి అప్పగిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.