AP: రాష్ట్రంలో ఉచితంగా మహిళలకు అందిస్తున్న కుట్టు శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. ఇందుకు స్థానికంగా ఉండే గార్మెంట్ పరిశ్రమలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.