CTR: వేపంజేరి లక్ష్మీనారాయణస్వామి ఆలయవార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి వచ్చే నెల 2 వరకు నిర్వహించనున్నట్లు ధర్మకర్త వాసు, మేనేజరు వెంకటేశుల రెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ స్వామివారికి అగ్నిహోమం, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అన్నదానం, పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.