MBNR: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను గురువారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ జానకి హాజరై సహచర పోలీసులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది తమ విధులు నిర్వర్తించడంతోపాటు సాంప్రదాయ ఉత్సవాలలో, వేడుకల్లో కూడా పాల్గొని ఆత్మీయతను చాటుకోవాలన్నారు.