ప్రకాశం: పరిశ్రమల్లో భద్రత పరమైన చర్యలు తప్పక తీసుకోవాలని కలెక్టర్ పీ. రాజాబాబు పరిశ్రమల శాఖ అధికారులతో పాటు అనుబంధ విభాగాల అధికారులను ఆదేశించారు. ఒంగోలులో తన ఛాంబర్లో గురువారం జిల్లా పరిశ్రమల కేంద్రం, ఫ్యాక్టరీలు, కార్మిక నేతలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పరిశ్రమల్లో పర్యావరణ సంబంధ నిబంధనలను కచ్చితంగా పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.