AP: లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని CM చంద్రబాబు హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వచ్చే వారి ఫొటోలను పోలీస్ స్టేషన్లు, ఆన్లైన్లో పెట్టి బహిర్గతం చేస్తామన్నారు. లైంగిక నేరస్థులపై రౌడీషీట్లు తెరుస్తామని, సమాజంలో అలాంటివారికి తావు ఉండదని స్పష్టం చేశారు. ఈ చర్యలు మహిళలపై నేరాలను అరికట్టడానికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.