TG: గిరిజన, బంజారా సముదాయాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ మేరకు మరో ఆరు కొత్త గిరిజన, బంజారా భవనాల నిర్మాణానికి రూ. 16.50 కోట్లు మంజూరు చేసింది. ఇవి వారి సాంస్కృతిక, విద్యా, సంక్షేమ కార్యక్రమాలకు ప్లాట్‌ఫామ్‌గా పనిచేయనున్నాయి. ఇప్పటికే ఉన్న 9 బంజారా భవనాల్లో అదనపు సౌకర్యాల కోసం కూడా నిధులు మంజూరు చేసింది.