SDPT: ‘స్వచ్ఛతా హీ సేవ – 2025’ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పురపాలక కమిషనర్ టి. మల్లికార్జున్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. ఎల్లమ్మ చెరువు దగ్గర ఉన్న పశువుల అంగడి వద్ద ‘ఏక్ దిన్- ఏక్ గంట- ఏక్- సాత్’ అనే కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరూ వారంలో రెండు గంటలు శుభ్రతకు కేటాయించాలని కమిషనర్ సూచించారు.